Movie: Telugu
Banner: Varahi Chalana Chitram
Cast: Anil, Mahima
Direction: Nandu Mallela
'రెండు రెళ్ళు ఆరు' అనే టైటిల్ వినగానే మనందరికీ గుర్తుకొచ్చే పేరు జంధ్యాల. కొత్త నటీనటులతో, కొత్త దర్శకుడు ఇలాంటి ఓ హిట్ సినిమా టైటిల్ పెట్టి ఎలా తీశాడనే ఆసక్తిని టైటిల్ నుండే పుట్టించాడు దర్శకుడు నందు మల్లెల. మరో వైపు ఈ సినిమాను వారాహి చలన చిత్రం విడుదల చేస్తుండటం. మంచి చిత్రాలను ప్రోత్సహించే వారాహి చలన చిత్రం ఈ సినిమాను విడుదల చేయడానికి ముందుకు రావడంతోనే సినిమా అందరి కంట్లో పడింది. అసలు డైరెక్టర్ చెప్పాలనుకున్న ప్రేమకథకు, జంధ్యాల సినిమా టైటిల్‌కు ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం...
కథ:
కథ ఇద్దరు తండ్రుల వైపు నుండి నడుస్తుంది. రాజు(సీనియర్ నరేష్), రావు(రవికాలే) ఇద్దరికీ ఒకేసారి పిల్లలు పుడతారు. రావుకు అమ్మాయి పుడతుంది. రాజుకి అబ్బాయి పుడతాడు. అయితే ఇద్దరి పిల్లలకు గుండు సంబంధిత జబ్బు ఉందని, 22 ఏళ్ళ తర్వాత వారిద్దరూ ఏ క్షణంలో అయినా చనిపోవచ్చునని డాక్టర్స్ చెబుతారు. తమ భార్యలను దృష్టిలో పెట్టుక్ను రావు, రాజులు ఒకరి సమస్యను ఒకరికి చెప్పకుండా దాచిపెట్టి పుట్టిన బిడ్డలను మార్చుకుంటారు. ఇద్దరు ఎదురెదురు ఇళ్ళలో ఉండటం వల్ల పిల్లలు కూడా కలిసిపోతుంటారు. రావు భార్య, రాజు భార్య తమ పిల్లలకు పెళ్ళి చేయాలనుకంటారు. ఇది నచ్చని రాజు, రావు పిల్లల మధ్య గొడవలు పెడతారు. ఇద్దరు పిల్లలు గొడవలతో ఒకరంటే ఒకరికి పడకుండా పెరిగి పెద్దవుతారు. అబ్బాయి మ్యాడీ(అనిల్ మల్లెల), అమ్మాయి మ్యాగి(మహిమ) ఎప్పుడూ గొడవలు పడుతుంటారు, కథ ఇలా సాగుతుండగా ఓ సందర్భంలో ఇద్దరు ప్రేమలో పడతారు. పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. అప్పుడు రాజు, రావు ఏం చేస్తారు? అసలు విషయం చెబుతారా? ఎప్పుడూ కొట్టుకునే మ్యాడీ, మ్యాగీ ఎలా ప్రేమలో పడతారు అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
విశ్లేషణ:
పాత్రధారులు:
హీరో అనిల్ మల్లెల మ్యాడీ పాత్రలో చక్కగా చేశాడు. ఎక్కడా ఓవర్ హీరోయిజంను ప్రదర్శించకుండా కథకు ఏం కావాలో అది మాత్రమే చేశాడు. కామెడి పండించడంలో కూడా సక్సెస్ అయ్యాడు. హీరోఇయన్ మహిమ ... హీరోయిన్‌కు ఉండాల్సిన ప్రథమ లక్షణం నటనతో పాటు అందం. మహిమ గ్లామర్‌గా కనపడలేదు. నటన పరంగా మెప్పించింది. రాజుగారి పాత్రలో నటించిన సీనియర్ నరేష్ పాత్రలకు వంద శాతం న్యాయం చేశాడు. పెంచిన కూతురు ఇంట్లోనే ఉన్నా, కన్న కొడుకు ఎదురింట్లో ఉన్నప్పుడు తండ్రి ఎలా ప్రవరిస్తాడనేది నరేష్ నటనలో కనపడుతుంది. ఇక విలన్‌గా నటించిన రవికాలే ఈ సినిమాలో మాత్రం బాధ్యత గల తండ్రి పాత్రలో నటించడం ఒకటైతే, రవి కాలే తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడం కొసమెరుపు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో పాత్ర తాగుబోతు రమేష్‌ది. ఎప్పుడూ తూలుతూ నటించే రమేష్ ఈ సినిమాలో కొత్తగా కనపడ్డాడు. నటన పరంగా సెకండాఫ్‌లో ఆడియెన్స్‌ను నవ్వించాడు.
ప్లస్ పాయింట్స్:
ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు నందు మల్లెల. సినిమా కథను హీరో, హీరోయిన్ తండ్రుల వెర్షన్‌లో రన్ చేయడం సినిమాలో కొత్తదనాన్ని తెచ్చింది. ఏదో ప్రేమకథను చెప్పాలనుకుని కాకుండా కాస్తా భిన్నంగా చెబుదామని కొత్త పాయింట్‌తో సినిమాను తీశాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఇద్దరు తీసుకునే నిర్ణయం ఆరుగురి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పిందనేదే కథ. కథలో హీరో హీరోయిన్ గొడవ పడుతుండటంతో ఫస్ట్ హాఫ్ అంతా వీరి గొడవల కామెడితో సాగిపోతుంది. హీరో ప్రేమను హీరోయిన్ చెడగొట్టడం, హీరోయిన్ లవ్‌ను హీరో చెడగొట్టడం అన్ని కామెడి పంథాలో సాగుతుంది.
ప్రీ క్లైమాక్స్‌లో అసలు విషయం హీరో,హీరోయిన్‌కు తెలిసి పోవడంతో అసలు కథ మొదలవుతుంది. ఇద్దరు తండ్రులు పడే సంఘర్షణ, ఎమోషన్ అంతా దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. అనిల్ మల్లెల, మహిమ చక్కగా నటించారు. వెంకట్ అమర్‌నాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో పల్లెటూరి అందాలను చక్కగా ఎలివేట్ చేశాడు. విజయ్ బుల్‌గానిన్ సంగీతం బావుంది. సిచ్యువేషనల్‌సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావున్నాయి. కష్టాలు వచ్చేవి భార్య భర్తల మధ్య బంధాన్ని మరింత కలపడానికే.
ఏ రిలేషన్ అయినా పాడైతే రిలేషన్ మాత్రమే పోతుంది. అదే భార్య భర్తల రిలేషన్ పోతే జీవితం పోతుంది...
నేను అనుకునే ఇద్దరినీ కలపడం ఎంత కష్టమో, మనం అనుకునే ఇద్దరినీ విడదీయడం అంతే కష్టం.
జీవితం నాకు ఓ తల్లిదండ్రులనిస్తే..మీరు నాకో ఇంకో తల్లిదండ్రులనిచ్చారు..
ఇలాంటి డైలాగ్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి.
నేను అనుకునే ఇద్దరినీ కలపడం ఎంత కష్టమో, మనం అనుకునే ఇద్దరినీ విడదీయడం అంతే కష్టం.
జీవితం నాకు ఓ తల్లిదండ్రులనిస్తే..మీరు నాకో ఇంకో తల్లిదండ్రులనిచ్చారు..
ఇలాంటి డైలాగ్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి.
Review Credit: http://www.indiaglitz.com/rendu-rellu-aaru-telugufont-movie-review-21613.html
0 Comments